ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ శనివారం కుబీర్ మండలంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉ. 11 గంటలకు ఎంపిడిఓ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి, అనంతరం మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. కావున మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.