రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి

575చూసినవారు
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి సుగుణ రంజాన్ వేడుకల్లో పాల్గొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అల్లా కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం మాత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్