హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని దీని కొరకు అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఇప్పటికే మంజూరైన అర్లీ బ్రిడ్జి ను రీ శాంక్షన్ (కొత్త ఎస్టిమేట్స్) తో అనుమతి ఇవ్వాలని కోరారు.