ముధోల్ మండలం రాంటేక్ గ్రామంలో గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని గురువారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామఅభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణం లో కళ్యాణమండపం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను గ్రామస్తులు ఘనంగా స్వాగతించి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో
మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.