ముధోల్: ఉపాధి హామీ పనుల పరిశీలన

52చూసినవారు
ముధోల్:  ఉపాధి హామీ పనుల పరిశీలన
ముధోల్ లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం టెక్నికల్ అసిస్టెంట్ యోగేష్ పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన కొలతల ప్రకారం పనులు పూర్తిచేసి దినసరి కూలి రూ. 307 పొందాలని, జాబ్ కార్డులో ఒకరిపేరు మీద మరొకరు రాకూడదని తెలిపారు. ఉదయం 6గంటల నుంచి 11గంటల లోపు పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. అయన వెంట పీల్డ్ అసిస్టెంట్ సోని, మెట్లు నగేష్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్