ముధోల్: గ్రామాల సమగ్ర అభివృద్ధి కృషి చేస్తా: ఎమ్మెల్యే

66చూసినవారు
ముధోల్: గ్రామాల సమగ్ర అభివృద్ధి కృషి చేస్తా: ఎమ్మెల్యే
గ్రామాల సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం ముధోల్లోని క్యాంప్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు సిసి రోడ్లు డ్రైనేజీ కొరకు రూ 10 కోట్లు మంజూరు చేసినందుకు స్థానిక నాయకులు ఎమ్మెల్యేను శాలువత సన్మానించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తానని వెల్లడించారు. మాజీ ఎంపీటీసీ భూమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్