ముథోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ బెస్ట్ డాక్టర్ అవార్డుకు ఎన్నికయ్యారు. వైద్యరంగంలో విశిష్టమైన సేవలు అందించినందుకు సుమన్ టీవీ వారు ఈ అవార్డుకు డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ను ఎన్నిక చేసినట్లు తెలిపారు. హైదరాబాదులో ఆదివారం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ కు ఘనంగా సన్మానించి, ఎమ్మెల్సీ అద్దంకి శ్రీనివాసరావు చేతులమీదుగా అవార్డును అందించారు.