వేసవికాలంలో ప్రజలకు నీటి సమస్యను తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి అన్వర్ అలీ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన ముథోల్ లోని ఎస్సీ కాలనీలో నీటి కనెక్షన్ ను మినీ వాటర్ ట్యాంక్ కు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వార్డుల వారీగా నీటి వృధాను గుర్తించడం జరిగిందన్నారు. సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.