తానూర్ లో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల పండుగ

55చూసినవారు
నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని డంగాపల్లి లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం ముదిరాజ్ సంఘం అధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చనలు అభిషేకాలు చేశారు. ఇంటికో బోనం చొప్పున మహిళలు బోనాలను ఎత్తుకొని పలు విధుల్లో తరలి వెళ్ళి ఆలయంలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్