భారీగా కురుస్తున్న వర్షలకు కుబీర్ మండలంలోని సోనారి నుండి గోడాపూర్ గ్రామానికి వెళ్లి రోడ్డు హంపోలి గ్రామంవద్ద గురువారం కోతకు గురైంది. దీంతో పాఠశాల బస్సుకు అంతరాయం ఏర్పడడంతో గోడాపూర్ నుండి పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.