లొకేశ్వరం పోలీస్ స్టేషన్ లో పని చేసి పదవీ విరమణ పొందిన ఎస్ఐ మోహన్ రావును ముథోల్ సిఐ మల్లేష్, ఎస్ఐ సాయి కుమార్, పోలీస్ సిబ్బంది ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో చేసిన సేవలే అందరికి గుర్తింపునిస్తాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సేవలందించారని అన్నారు. విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.