భైంసా మండల బీజేపీ అధ్యక్షులుగా దేగాం గ్రామానికి చెందిన సిరం సుష్మా రెడ్డి ఎంపికయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఎంపికను ఖరారు చేశారని జిల్లా రిటర్నింగ్ అధికారి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురువారం ప్రకటించారు. తనపై విశ్వాసంతో మండల నూతన అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డికి, ఎమ్మెల్యే రామారావు పటేల్ కు కృతజ్ఞతలు తెలిపారు.