తానూర్ మండలం బెలారోడా ఏక్స్ రోడ్డు వద్ద భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోయినా, వాహన అనుమతి పత్రాలు, లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ముధోల్ సీఐ మల్లేష్, తానూర్ ఎస్ఐ రమేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.