తానూర్: చెరువుల మరమ్మత్తులపై ప్రధాన దృష్టి: ఎమ్మెల్యే

76చూసినవారు
నియోజకవర్గంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువులకు మరమ్మత్తులు చేపట్టి, రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం తానుర్ మండలం బెల్తరోడ గ్రామంలో రూ. 47 లక్షల నిధులతో చెరువు మరమ్మత్తు నిర్మాణ పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. చెరువులు దెబ్బతిన్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగిందని, ప్రభుత్వం దశలవారీగా నిధులు మంజూరు చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్