తానూర్: భారత జట్టుకు ఎంపికయ్యాడు.. కానీ పేదరికం అడొచ్చింది

57చూసినవారు
తానూర్ మండలం ఝరి(B)కి చెందిన రాథోడ్ ఉదయ్ కుమార్ దివ్యాంగ క్రీడాకారుడు. ఫుట్బాల్ క్రీడలో భారత జట్టుకు ఎంపికయ్యాడు. జాతీయ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వరకు ఇరాన్లో జరిగే వెస్ట్ ఏషియన్ చాంపియన్షిప్లో పాల్గొనాలి. కానీ ఇందుకు రూ. 2 లక్షలు ఖర్చవుతుందని ఉదయ్ చెబుతున్నాడు. పేద కుటుంబంలో పుట్టిన తన దగ్గర డబ్బులు లేవని, దాతలు స్పందించి సాయం చేస్తే దేశం పేరు నిలబెడతానని పేర్కొంటున్నాడు.

సంబంధిత పోస్ట్