తెలంగాణ అవిర్భవా దినోత్సవ వేడుకలు తానూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యదర్శి జాదవ్ జాలం సింగ్ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎందరో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తాడేవార్ విఠల్, రాములు, మాధవ్ రావ్ పటేల్, మాజీ విడిసి అధ్యక్షులు శివాజీ పటేల్, కర్భారి రాజు పాల్గొన్నారు.