బాసర మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు

69చూసినవారు
జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు నారిశక్తి కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో మహిళా పోలీసులు విస్తృత వాహనాలను తనిఖీలు బుధవారం నిర్వహించారు. బాసర రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆలయం వద్ద వాహనాలను చెక్ చేశారు. వాహన దృవపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడవాలని మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్