బైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన రైతు మేడిపెల్లి సాయన్న, మేడిపెల్లి దేవేందర్ పంట విద్యుత్ ఘాతంతో మూడు ఎకరాల మొక్క జొన్న దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గురువారం రైతు కుటుంబాన్ని పరామర్శించారు. దగ్ధమైన పంట, ప్రదేశాన్ని పరిశీలించారు. ఉన్నత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన నష్ట పరిహారం ఇప్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు.