ముధోల్లో హోరాహోరీగా కుస్తీ పోటీలు

71చూసినవారు
ముధోల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం విడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన మల్లాయోధులు పాల్గొన్నారు. మల్ల యోధులు చివరి వరకు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడిన తీరు చూపరులను కనువిందు చేసింది. పోటీలో గెలుపొందిన విజేతకు ఐదు వేల నగదును అందించారు.
దాదాపు మల్ల యోధులకు లక్ష వరకు నగదు బహుమతులను పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్