దిలావర్పూర్ మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల హుండీ ఆదాయం 3 లక్షల 35 వేల 955 రూపాయల నగదు వచ్చిందని దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి తెలిపారు. ఇందులో ఆలయ ఈవో భూమయ్య, ఆలయ చైర్మన్ మహేష్, ఆలయ పూజారులు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.