నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండా ఎగరవేశారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు కష్టపడి పని చేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ లు కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.