ఎగువ కురుస్తున్న వర్షాలకు సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుందని గురువారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1, 183 అడుగులు (1. 484 టీఎంసీలు) కాగా, ప్రాజెక్టులోకి 937 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు తెలిపారు. వరద తగ్గడంతో అన్ని గేట్లు మూసి వుంచినట్లు తెలిపారు.