ఇన్‌స్టాగ్రామ్‌లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి మరొక వర్గం మనోభావాలు దెబ్బ తినే విధంగా పోస్ట్ చేశాడు. అది గమనించిన పోలీసులు ఆ వ్యక్తిని పిలిపించి పోస్ట్ డిలీట్ చేయించి, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.