నిర్మల్‌లో కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు చేయాలి
కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వపరంగా కంప్యూటర్ కేంద్రం ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల వారికి విద్య, వైజ్ఞానిక పరమైన శిక్షణలు ఇవ్వవచ్చునన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.