చాక్ పల్లిలో ప్రధాన రహదారిపైనే మురికి దుర్గంధం
నర్సాపూర్ జి) మండలంలోని చాక్ పల్లి గ్రామంలో మురికి కాలువల నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైవే 61 రోడ్డు పక్కన ఉన్న మస్జిద్ పరిసర ప్రాంతంలో మురికినీరు నిలువడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలు సాగించే ప్రజలు, మస్జిద్ కు వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.