నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గడ్ చంద గ్రామంలో శ్రీరాంసాగర్ జలాశయం బ్యాక్ వాటర్ భూములను ఆక్రమించి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. బ్యాక్ వాటర్ లో మిగులు భూమిని కొందరు ఆక్రమించుకొని విక్రయిస్తూ పంటలు సాగు చేస్తున్నారని ఆరోపించారు. పశువులు మేపేందుకు భూములు లేకుండా పోతున్నాయని, భూములకు బౌండరీ లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.