జలాశయంలోకి 350 క్యూసెక్కుల నీరు చేరిక

80చూసినవారు
జలాశయంలోకి 350 క్యూసెక్కుల నీరు చేరిక
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ జలాశయం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. స్వర్ణ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులకు కాగా, ప్రస్తుతం 1181. 3 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి ఇన్ ఫ్లో 350 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్