నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మున్సిపల్ సిబ్బంది నిర్వహిస్తున్న శానిటేషన్ పనులను లోకల్ బాడీ అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ ఆకస్మికంగా పరిశీలించారు. శానిటేషన్ వర్కర్లు వారు చేస్తున్న పనులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలు ద్వారా ఏవిధంగా చెత్త సేకరణ జరుగుతున్నది జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పట్టణంలో పారిశుద్ధ పనులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు.