ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామక ఉత్తర్వులు విడుదల చేయాలని తెలంగాణ జూనియర్ కళాశాల అతిథి అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో డీఐఈఓ జాదవ్ పరశురాం, డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుకు శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నాయని ఇప్పటివరకు అతిథి అధ్యాపకుల నియామక ఉత్తర్వులు విడుదల చేయలేదని అన్నారు. వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.