అట్టహాసంగా తిరంగా ర్యాలీ

85చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరిం చుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం అట్టహాసంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. యువకులు దేశ నాయకులను స్మరించుకుంటూ వారి చిత్రపటాలతో ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ర్యాలీ చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్