దిలావర్పూర్ మండల కేంద్రంలో బుధవారం ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభాయాత్ర గురువారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఎంపీఓ గోవర్ధన్, ఎస్సై రాజేశ్వర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ వీరేష్ లు నిమజ్జన శోభా యాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలను, హారతులు నిర్వహించారు. నిమర్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వారు అభినందించారు.