బైంసా: సంతోషిమాత ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయ 39వ వార్షికోత్సవంలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఆయనకు సాంప్రదాయ స్వాగతం పలికారు. సందర్భంగా ఆలయ అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేస్తానని భరోసా కల్పించారు.