బాసర: ప్రమాదకర ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఎస్పీ
బాసర గోదావరిలో ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమని ఆదివారం జిల్లా ఎస్పీ జి జానకి షర్మిల పేర్కొన్నారు. పవిత్ర గోదావరి వద్ద అనుమతి ఉన్న స్నానపు ఘాట్ల వద్ద స్నానాలు చేయాలని పిలుపునిచ్చారు. సమస్యాత్మక ప్రదేశాలలోకి వెళ్లి స్నానాలు చేయడం మనల్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదకరంగా ఉన్న స్నానపు ఘాట్ల వద్ద కట్టుదితమైన చర్యలు చేపడతామన్నారు.