భైంసా మండలం మహాగాం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో సోలార్ బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన జంగిటి చిన్నన్న అనే రైతు మొక్కజొన్న పంట రక్షణకు ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ బ్యాటరీలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.