ఇన్ ఛార్జ్ ఈఓగా బాధ్యతలు స్వీకరించిన భూమయ్య

54చూసినవారు
ఇన్ ఛార్జ్ ఈఓగా బాధ్యతలు స్వీకరించిన భూమయ్య
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు కదిలి పాపరేశ్వర ఆలయం, కాల్వ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం, ఉదాసీ మఠం ఇన్ ఛార్జ్ ఈఓగా కొమ్మోజీ భూమయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇన్ ఛార్జ్ ఈఓగా పనిచేసిన ఆలయాల డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్ గౌడ్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం దేవరకోట ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.

సంబంధిత పోస్ట్