నిర్మల్ పట్టణ శివారులోని ఇబ్రహీం చెరువు సమీపంలో గోవధకి సిద్ధంగా ఉన్న 100 పైగా ఆవులను పోలీసుల సహకారంతో బీజేపీ నాయకులు గురువారం పట్టుకున్నారు. కొందరూ అన్యమతస్తులు చెరువు సమీపంలో గోవధలు చేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న గోవధశాలను ఇక్కడ నుండి తరలించి ఇబ్రహీం చెరువుని పరిరక్షించాలని జిల్లా అధ్యక్షులు అంజూ కుమార్ రెడ్డి కోరారు.