ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బడ్జెట్ పై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్థావించడంతో పాటు, అసెంబ్లీ సమావేశాల కార్యాచరణ, తదితర అంశాలపై చర్చించారు.