సిద్దిపేటలో న్యాయవాది రవి కుమార్ పై పోలీసుల దాడిని ఖండిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి మాట్లడుతూ ప్రభుత్వం న్యాయవాద రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరారు. ఇందులో ప్రధాన కార్యదర్శి మహేందర్ న్యాయవాదులు శ్యాంసుందర్ రెడ్డి, గంగాధర్, రమణ రావు, రమణ, మధుకర్, శైలేంధర్, సాయికుమార్, రాజు, లిఖిత, వరలక్ష్మి పాల్గొన్నారు.