నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయి

63చూసినవారు
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయి
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదం చేస్తాయని నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్ అన్నారు. దిలవర్ పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామం వద్ద బుధవారం సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వీడీసీ సభ్యులతో మాట్లాడి మరమ్మతులు చేయించాలని సూచించారు. సీసీ కెమెరాలతో కలిగే ప్రయోజనాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఇందులో ఎస్సై రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :