నత్త నడకన మాదాపూర్ స్వర్ణ నది వంతెన నిర్మాణ పనులు

80చూసినవారు
సోన్ మండలంలోని మాదాపూర్ లో స్వర్ణ నదిపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతుంది. 2017 లో అప్పటి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ వంతెన నిర్మాణానికి తదిగిన నిధులు మంజూరు చేయించారు. అప్పుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఇప్పటినుండి ఇప్పటివరకు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నదిపై నిజాం కాలం నాటి వంతెన ఉన్న శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారింది.

సంబంధిత పోస్ట్