ఎగువ కురుస్తున్న వర్షానికి సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుందని బుధవారం ఉదయం అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1, 183 అడుగులు కాగా, ప్రస్తుతం 1, 183 అడుగులకు ఉందని తెలిపారు. ఎగువ నుంచి 100 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని అధికారులు వెల్లడించారు.