నిర్మల్ ఆర్టీసీ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాద దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో ప్రయాణిస్తున్న వారికి పువ్వులను అందజేశారు. అనంతరం డీఎం మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శుక్రవారం ఆర్టీసీ మర్యాద దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.