దస్తురాబాద్: బావిలో పడిన దుప్పిని కాపాడిన గ్రామస్తులు

60చూసినవారు
దస్తురాబాద్ మండలం అకొండ పేట గ్రామ శివారులో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. దుప్పి ప్రమాదవశాత్తు గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శనివారం తెల్లవారుజామున పడింది. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో అటవీశాఖ సిబ్బంది దుప్పిని బయటకి తీశారు. తీవ్రంగా గాయాలపాలైన దుప్పిని గుర్తించి విచారణ జరిపారు.

సంబంధిత పోస్ట్