
జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చారు: మిచెల్ జాన్సన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ పలువురు ఆటగాళ్ల తీరుపై మండిపడ్డాడు. ' ఇటీవల కాలంలో హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్‌పై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అతడు జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వాయిదా పడిన తర్వాత ఐపీఎల్‌కు తిరిగి వెళ్లాలన్న అతడి నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక లైయన్ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు' అని విమర్శించాడు.