సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల పూజలు

70చూసినవారు
స్కంద పంచమి సుబ్రహ్మణ్య షష్టి పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీగిరి క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు. అనంతరం వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య షష్టి, స్కంద పంచమి విశిష్టతను వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్