వేసవి క్రీడా శిబిరంలో విద్యార్థులకు పండ్ల పంపిణీ
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్న విద్యార్థులకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అరటిపళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయులు పిల్లల ఆరోగ్య రీత్యా పండ్ల పంపిణీ కొనసాగిస్తామన్నారు. క్రీడాల నైపుణ్యతను విద్యార్థులు పెంపొందించుకోవాలని కోరారు.