వెంగ్వాపేట పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి రామారావు

77చూసినవారు
వెంగ్వాపేట పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి రామారావు
జిల్లా విద్యాధికారి పి రామారావు శుక్రవారం ఉదయం నిర్మల్ రూరల్ మండలం లోని వెంగ్వాపెట్ ఉన్నత పాఠశాలను ప్రార్థన సమయానికి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, సిబ్బంది పనితీరు ఉన్న సౌకర్యాలు కావలసిన అభివృద్ధి పై ఆరా తీశారు. పదవ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కష్టపడాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.