నేడు బైంసాలో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి జానకి షర్మిల బైంసా క్యాంపు ఆఫీస్ లో ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా షి సిబ్బంది కూడా అందు బాటులో ఉంటారు. బైంసా సబ్ డివిజన్ లోని ఫిర్యాదుదారులు ఎస్పీకు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చునని అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు.