సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో వీడిసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద జిల్లా ఎస్పీ జానకి షర్మిల శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమర్జనం, శోభయాత్ర శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా ఎస్పీని వీడిసి సభ్యులు ఘనంగా సత్కరించారు.