ఆటపాటల ద్వారా విద్యను అందజేయాలి

60చూసినవారు
ఆటపాటల ద్వారా విద్యను అందజేయాలి
అంగన్వాడి కేంద్రాల్లో మూడేళ్ల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యను అందజేయాలని సీడీపీఓ నాగలక్ష్మి అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామ మహిళ ప్రాంగణంలో అంగన్వాడీ టీచర్లకు మూడు రోజుల శిక్షణ తరగతులు చేపట్టారు. విద్యార్థులకు ఆటపాటల ద్వారా విద్యను అందిస్తే మానసిక ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు. ఇందులో మాస్టర్ ట్రైనర్స్ విజయ గౌరీ, మంగళ, జ్యోతి, రజిని దేవి తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్